నిజామాబాద్ జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
మాచారెడ్డి: నిజామాబాద్ జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మాచారెడ్డి మండలం భవానీపేట వద్ద ఓ కారు, ఆటో ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ఘటనలో పలువురు తీవ్ర గాయపడినట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలతో పాటు ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.