ఖమ్మం పట్టణానికి చెందిన ఓ యువకుడికి ఉగ్రవాద సంస్థ అయిన ఐఎస్‌ఐఎస్‌తో సంబంధం ఉందనే కారణంతో టర్కీ పోలీసులు
ఖమ్మం : ఖమ్మం పట్టణానికి చెందిన ఓ యువకుడికి ఉగ్రవాద సంస్థ అయిన ఐఎస్‌ఐఎస్‌తో సంబంధం ఉందనే కారణంతో టర్కీ పోలీసులు అదుపులో తీసుకోవటం నగరంలో కలకలం రేకెత్తించింది. ఈ విషయాన్ని బెంగళూరు పోలీసులు ఖమ్మం పోలీసులకు సమాచారం అందించటంతో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఖమ్మంలోని అతని ఇంట్లోవారిని విచారించినట్లు తెలిసింది. ఖమ్మంలోని పంపింగ్‌వెల్‌రోడ్‌కు చెందిన ఓ యువకుడు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. గత నెల 27న అతడు టర్కీలోని ఇస్తాంబుల్ విమానాశ్రయంలో దిగడంతో అక్కడి పోలీసులకు అనుమానం వచ్చి విచారించారు. అతనితో పాటు మరో ముగ్గురు సిరియాలో ఐఎస్‌ఐఎస్ శిక్షణకు వెళ్తున్నట్లు తేలింది. దీంతో అక్కడి పోలీసులు వీరి గురించి కర్ణాటక పోలీసులకు తెలిపారు. ఈ సమాచారంతో హైదరాబాద్ పోలీసులు అతనింట్లో తనిఖీలు చేశారు.