వరవరరావు ఆరోగ్యాన్ని కాపాడండి: భట్టి

సాక్షి, హైదరాబాద్: భీమాకోరేగావ్ కేసులో 2018 ఆగస్టులో అరెస్టయిన వరవరరావు ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉందని, ఆయన ఆరోగ్యాన్ని కాపాడాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. తెలంగాణ పౌరసమాజం కోసం, రాజ్యాంగం ఇచ్చిన పౌరహక్కుల సాధన, భావ ప్రకటన కోసం, పేదల కోసం ఉద్యమిస్తున్న వరవరరావుకు జైల్లో ఏదైనా జరిగితే అది రాజ్యం చేసిన ద్రోహం అవుతుందని భట్టి ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి