పరేడ్ గ్రౌండ్స్‌లో నేడు టీఆర్ఎస్ భారీ సభ | trs public meeting over GHMC elections in pared grounds today | Sakshi
Sakshi News home page

పరేడ్ గ్రౌండ్స్‌లో నేడు టీఆర్ఎస్ భారీ సభ

Jan 30 2016 11:46 AM | Updated on Sep 3 2017 4:38 PM

పరేడ్ గ్రౌండ్స్‌లో నేడు టీఆర్ఎస్ భారీ సభ

పరేడ్ గ్రౌండ్స్‌లో నేడు టీఆర్ఎస్ భారీ సభ

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో శనివారం సాయంత్రం టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించనుంది.

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో శనివారం సాయంత్రం టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలపై కేసీఆర్ ఈ సభలో పలు కీలక అంశాలను ప్రస్తావించనున్నారని సమాచారం. అయితే ఈ సభ ఏర్పాట్లను మంత్రులు దగ్గరుండి పరేడ్ గ్రౌండ్స్లో పర్యవేక్షిస్తున్నారు.

ఈ రోజు సాయంత్రం 4.00 గంటలకు టీఆర్ఎస్ బహిరంగ సభ ప్రారంభం కానుంది. కేసీఆర్ 7.00 గంటలకు పరేడ్ గ్రౌండ్స్ చేరకొని 7.15 గంటలకు బహిరంగ సభలో ప్రసంగిచనున్నారు. ఈ సభ కోసం మూడు వేదికలను ఏర్పాటు చేశారు. ఒక వేదికపై సీఎంతో సీనియర్ మంత్రులు, మరో వేదికపై జీహెచ్ఎంసీ అభ్యర్థులు, మూడో వేదికపై కళాకారులు ఉంటారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం రేపటితో ముగియనున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement