జవదేకర్‌తో టీఆర్‌ఎస్‌ ఎంపీల భేటీ | TRS MPs meet with Javadekar | Sakshi
Sakshi News home page

జవదేకర్‌తో టీఆర్‌ఎస్‌ ఎంపీల భేటీ

Dec 28 2018 4:59 AM | Updated on Dec 28 2018 5:32 AM

TRS MPs meet with Javadekar - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఏర్పాటు చేయాల్సిన పలు విద్యాసంస్థలపై చర్చించేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌తో టీఆర్‌ఎస్‌ ఎంపీలు గురువారం ఢిల్లీలో భేటీ అయ్యారు. అనంతరం ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణలో విద్యా సంస్థల ఏర్పాటుపై చర్చించాం. సిద్దిపేట కేంద్రీయ విద్యాలయంలో సీట్ల సంఖ్య పెంచాలని కోరాం. మా విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు’అని వివరించారు. ఈ భేటీలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో పాటు లోక్‌సభాపక్ష నేత ఏపీ జితేందర్‌రెడ్డి, బీబీ పాటిల్, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, బండ ప్రకాశ్‌ ముదిరాజ్‌ పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement