టీఆర్‌ఎస్‌ విద్యాభివృద్ధికి పాటుపడింది | TRS Helped Education In Nizamabad | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ విద్యాభివృద్ధికి పాటుపడింది

Nov 23 2018 4:59 PM | Updated on Jul 11 2019 5:01 PM

TRS Helped Education In Nizamabad - Sakshi

మాట్లాడుతున్న శ్రీనివాస్‌యాదవ్‌

 సాక్షి, కామారెడ్డి టౌన్‌: రాష్ట్రంలో విద్యాభివృద్ధికి పాటుపడిందని, టీఆర్‌ఎస్‌ను మళ్లీ గెలిపించాలని టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు జి.శ్రీనివాస్‌యాదవ్‌ అన్నా రు. గురువారం జిల్లా కేంద్రంలో బాబాగౌడ్‌ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన విద్యార్థుల కృతజ్ఞత సభ లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా విద్యాభివృద్ధికి పాటు పడింది కేసీఆర్‌ అన్నారు. నియోజకవర్గానికో గురుకుల విద్యాలయాలు, రెడిడెన్షియల్‌ పాఠశాలలు, సం క్షేమ హస్ట ళ్లు, ఆదర్శ పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పేద విద్యార్థులకు ఉన్నత చదువులకోసం పాటు పడుతున్నారన్నారు.

అంతేకాక అంగన్‌వాడీలు, హస్టల్‌లలో సన్నబియ్యంతో పౌష్టికాహారం అందుతుందన్నారు. ఆసరా పింఛన్లు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ ఇలా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌వి జిల్లా కో ఆర్టినేటర్‌ చందు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజేశ్, నాయకులు వెంకటేశ్, విజయ్, రాజేశ్, అఖిల్, అంజు, ప్రసాద్, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement