కారు స్పీడ్‌ పెరిగింది!

TRS Gets A Massive Victory In Local Body Elections In Telangana - Sakshi

32 జెడ్పీల్లోనూ టీఆర్‌ఎస్‌ గెలుపు 

ఎంపీటీసీస్థానాల్లోనూ గులాబీసేన ఆధిక్యం

జెడ్పీ చైర్‌పర్సన్‌ అభ్యర్థులపై అధిష్టానం కసరత్తు

ఎన్నికల రోజునే అభ్యర్థిపేరు ప్రకటన

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రజలు మరోసారి అధికార టీఆర్‌ఎస్‌కే పట్టంకట్టారు. పరిషత్‌ ఎన్ని కల్లో ఆ పార్టీకి ఏకపక్ష విజయాన్ని అందించారు. రాష్ట్రంలో 32 జిల్లాల్లోని 5,817 ఎంపీటీసీ, 538 జెడ్పీ టీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా 158 ఎంపీటీసీ, నాలుగు జెడ్పీటీసీ స్థానాలను టీఆర్‌ఎస్‌ ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఏకగ్రీవమైన వాటితో కలిపి మొత్తం 3,556 ఎంపీటీసీ, 451 జెడ్పీటీసీ స్థానాల్లో అధికార పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో రాష్ట్రంలో మొదటిసారిగా 32 జెడ్పీల్లోనూ గులాబీ జెండా ఎగరనుంది. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షే మ పథకాలను ప్రజలకు చేరవేడయంలో కీలకంగా వ్యవహరించే జెడ్పీలు, ఎంపీపీల్లో ఏకపక్ష విజయం టీఆర్‌ఎస్‌కు పెద్ద ఊపునిచ్చింది. లోక్‌సభ ఎన్నికల మిశ్రమ ఫలితాలతో ఆ పార్టీలో నెలకొన్ని ఒక రకమైన ఇబ్బందికర పరిస్థితి.. తాజాగా వచ్చిన పరి షత్‌ ఫలితాలతో తొలగిపోయింది. తెలంగాణ ప్రజ లు లోక్‌సభ ఎన్నికలను జాతీయ రాజకీ యాల దృష్టి లో చూశారని, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు తిరుగులేదని చెప్పేందుకు పరిషత్‌ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని పార్టీ ముఖ్యనేత ఒకరు అభిప్రాయపడ్డారు.

ఎన్నికల రోజునే చైర్‌పర్సన్లపై నిర్ణయం 
జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్, వైస్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థు ల ను టీఆర్‌ఎస్‌ అధిష్టానం నిర్ణయించనుంది.    కేసీఆర్‌  రెండు జిల్లాల చైర్‌పర్సన్‌ అభ్యర్థులను ప్రక టించారు. మిగిలిన అభ్యర్థుల ఎంపికపైనా ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఈ మేరకు అన్ని జెడ్పీల చైర్‌ పర్సన్‌ అభ్యర్థుల జాబితాను మంత్రులకు, ఇన్‌ చార్జిలకు పంపించనున్నారు. పోటీని నివారించేం దు కు అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని కేటీఆర్‌ పార్టీ ఎన్నికల ఇన్‌చార్జిలకు స్పష్టంచేశారు.  టీఆర్‌ఎస్‌ జెడ్పీటీసీ సభ్యులందరినీ హైదరాబాద్‌కు తరలిం చేందుకు ఏర్పాట్లు పూర్త య్యాయి. జెడ్పీ చైర్‌పర్సన్‌ ఎన్నిక రోజున వారిని మళ్లీ జిల్లాలకు పంపించేలా టీఆర్‌ఎస్‌ ఎన్నికల వ్యూహం అమలు చేస్తోంది.

ఏయే జెడ్పీలకు ఎవరెవరు?

  • ఆసిఫాబాద్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఆసిఫాబాద్‌ మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మి పేరును కేసీఆర్‌ ఇదివరకే ప్రక టించారు. లక్ష్మి ఏకగ్రీవంగా జెడ్పీటీసీగా ఎన్నిక య్యారు. మంచిర్యాల  చైర్‌పర్సన్‌గా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు భార్య భాగ్యలక్ష్మి పేరు దాదాపుగా ఖరారైంది. ఆమె కోటపల్లి జెడ్పీటీసీగా గెలిచారు. నిర్మల్‌ చైర్‌పర్సన్‌గా నిర్మల్‌రూరల్‌ జెడ్పీటీసీ   కొరి పెల్లి విజయలక్ష్మికి అవకాశం ఇవ్వా లని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. ఆదిలాబాద్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌గా నేరడిగొండ జెడ్పీటీసీ అనిల్‌జాదవ్, నార్నూర్‌ జెడ్పీటీసీ జనార్దన్‌ రాథోడ్‌ పేర్లను పరిశీలిస్తోంది. 
  • నిజామాబాద్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌గా దాదాన్నగారి విఠల్‌రావును టీఆర్‌ఎస్‌ ఖరారు చేసింది. విఠల్‌రావు మాక్లూర్‌ నుంచి ఏకగ్రీవంగా జెడ్పీటీసీగా ఎన్నిక య్యారు. ఉమ్మడి నిజామాబాద్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ దఫేదార్‌రాజు సతీమణి దఫేదార్‌ శోభకు కామారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్‌గా అవకాశం ఇవ్వనున్నారు. ఆమె నిజాంసాగర్‌ జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. 
  • పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకు అవకాశం ఇస్తున్నట్లు  కేసీఆర్‌ ఇదివరకే ప్రకటించారు. కరీంనగర్‌ జెడ్పీ చైర్‌ప ర్స న్‌గా ఇల్లంతకుంట జెడ్పీటీసీ కనుమల విజయ, జగి త్యాల  చైర్‌పర్సన్‌గా బుగ్గారం జెడ్పీటీసీ బి. రాజేం దర్, సిరిసిల్ల చైర్‌పర్సన్‌గా కోనారావుపేట జెడ్పీటీసీ ఎన్‌.అరుణ పేర్లను అధిష్టానం పరిశీలిస్తోంది. 
  • ఉమ్మడి రంగారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఉన్న పట్నం సునీతారెడ్డికి టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఈసారి వికారాబాద్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌గా అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. సునీతారెడ్డి కోట్‌పల్లి జెడ్పీటీసీ సభ్యు రాలిగా గెలిచారు. రంగారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్‌గా మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కోడలు తీగల అనితారెడ్డికి అవకాశం ఇవ్వాలని పార్టీ యోచిస్తోంది. ఆమె మహేశ్వరం జెడ్పీటీసీ సభ్యురాలిగా గెలిచారు. మేడ్చల్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ పదవి కోసం మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి పేరును టీఆర్‌ఎస్‌ పరిశీలిస్తోంది. మేడ్చల్‌ మాజీ ఎమ్మెల్యే ఎం.సుధీర్‌రెడ్డి కుమారుడైన శరత్‌చంద్రారెడ్డి ఘట్‌కేసర్‌ జెడ్పీటీసీ సభ్యుడిగా విజయం సాధించారు. 
  • నల్లగొండ జెడ్పీ చైర్మన్‌గా బండ నరేం దర్‌రెడ్డి అవకాశం ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. ఆయన నార్కట్‌పల్లి జెడ్పీటీసీ సభ్యుడిగా గెలిచారు. యాదాద్రి భువనగిరి చైర్మన్‌ పదవికి మాజీ మంత్రి ఉమామాధవరెడ్డి కుమారుడు సందీప్‌రెడ్డి, సూర్యా పేట చైర్‌పర్సన్‌గా గుజ్జ దీపిక పేర్లను  అధిష్టానం పరిశీలిస్తోంది. సందీప్‌రెడ్డి బొమ్మల రామారం, దీపిక తుంగతుర్తి జెడ్పీటీసీలుగా గెలిచారు. 
  • ఖమ్మం చైర్మన్‌ పదవి లింగాల కమల్‌రాజ్, కొత్తగూడెం జెడ్పీ చైర్‌పర్సన్‌గా కోరం కనుకయ్యలకు అవకాశం ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ దాదాపుగా నిర్ణయించింది. కమల్‌రాజ్‌ మధిర జెడ్పీటీసీగా, కనుకయ్య టేకులపల్లి జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. 
  • సిద్దిపేట జెడ్పీ చైర్‌పర్సన్‌గా వేలేటి రోజా, మెదక్‌   చైర్‌పర్సన్‌గా హేమలత, సంగారెడ్డి చైర్‌పర్సన్‌గా ఎస్‌.మంజుశ్రీ పేర్లను టీఆర్‌ఎస్‌ పరిశీలిస్తోంది. రోజా చిన్నకోడూరు, హేమలత మనోహరాబాద్, మంజుశ్రీ పుల్కల్‌ జెడ్పీటీసీలుగా గెలిచారు.
  • వరంగల్‌ అర్బన్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌గా మారపెల్లి సుధీకుమార్, వరంగల్‌ రూరల్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌గా గండ్ర జ్యోతి, ములుగు జెడ్పీ చైర్‌పర్సన్‌గా కుసుమ జగదీశ్‌ పేర్లను టీఆర్‌ఎస్‌ దాదాపుగా ఖరారు చేసింది. సుధీర్‌కుమార్‌ ఎల్కతుర్తి, జ్యోతి శాయం పేట, జగదీశ్‌ ఏటూరునాగారం జెడ్పీటీసీలుగా గెలి చారు. మహబూబాబాద్‌ చైర్‌పర్సన్‌గా జి.సుచిత్ర, భూపాలపల్లి చైర్‌పర్సన్‌గా కాటారం జెడ్పీటీసీ జక్కు శ్రీహర్షిని, జనగామ చైర్‌పర్సన్‌గా చిల్పూరు జెడ్పీ టీసీ ఎస్‌.సంపత్‌రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
  • మహబూబ్‌నగర్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌గా స్వర్ణ సుధా కర్‌ పేరు ఖరారైంది. నాగర్‌కర్నూల్‌ చైర్‌పర్సన్‌గా కల్వకుర్తి జెడ్పీటీసీ భరత్, గద్వాల జెడ్పీ చైర్‌పర్స న్‌గా మానవపాడు జెడ్పీటీసీ సరిత, వనపర్తి జెడ్పీ చైర్‌పర్సన్‌గా వనపర్తి జెడ్పీటీసీ లోక్‌నాథరెడ్డి, నారా యణపేట జెడ్పీ చైర్‌పర్సన్‌గా నారాయణపేట జెడ్పీ టీసీ అంజలి పేర్లను అధిష్టానం పరిశీలిస్తోంది. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top