సాక్షి, హైదరాబాద్: పంచాయితీ ఎన్నికల వేల రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పదవుల ఆక్షన్, బలవంతపు విత్‌డ్రాల్స్‌పై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసింది. అన్‌కాంటెస్టెడ్ ఫలితాలపై Rule–15 దుర్వినియోగం నివారించేందుకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
ప్రతి విత్‌డ్రా సమయంలో అభ్యర్థుల నుంచి రెండు డిక్లరేషన్లు తప్పనిసరి. ఒక్క అభ్యర్థి మిగిలితే RO వెంటనే Form-X సిద్ధం చేయాలి. ఆర్వో పంపిన సమాచారం డీఈఏ అదేరోజు ధృవీకరించాలి. వేలం/బెదిరింపు ఆధారాలు ఉంటే ఫలితాన్ని ఆర్వో తాత్కాలికంగా నిలిపేయాలి. నిబంధనలు అతిక్రమిస్తే పంచాయతీ ఎన్నికలను రద్దు చేయాలి అని ఆదేశాల్లో స్పష్టం చేసింది. అన్‌కాంటెస్టెడ్ ఫలితాలు స్వచ్ఛమైనవి అని నిర్ధారించినప్పుడే ప్రకటించాలని.. మొత్తం ప్రక్రియను ఆలస్యం లేకుండా పూర్తి చేయాలని ఎస్‌ఈసీ పేర్కొంది.


