మాజీ మంత్రి టీఆర్ఎస్లోకి రావద్దంటు ఆందోళన | TRS counsellors portest Sudarshan Reddy to join trs | Sakshi
Sakshi News home page

మాజీ మంత్రి టీఆర్ఎస్లోకి రావద్దంటు ఆందోళన

Aug 2 2014 1:13 PM | Updated on Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్కు హ్యాండ్ ఇచ్చి కారు ఎక్కుదామనుకుంటున్న మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి స్థానికంగా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.

నిజామాబాద్‌: కాంగ్రెస్కు హ్యాండ్ ఇచ్చి కారు ఎక్కుదామనుకుంటున్న మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి స్థానికంగా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఆయన టీఆర్ఎస్లో రావద్దంటూ ఆపార్టీ కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో శనివారం టీఆర్ఎస్ కౌన్సిలర్లు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. 

 

కాగా గత కొంతకాలంగా స్థబ్దుగా ఉన్న సుదర్శన్ రెడ్డి టీఆర్ఎస్లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాన్ని ఆయన కూడా ఖండించకపోవటం గమనార్హం. సుందర్శన్ రెడ్డి టీఆర్‌ఎస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారనే విషయంపై ఆయన అనుచర వర్గం కూడా అవననే అంటోంది. ఇదే విషయంపై ఆయన శనివారం హైదరాబాద్‌లో బోధన్ నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమైనట్లు సమాచారం.

 

Advertisement
 
Advertisement
Advertisement