టీఆర్‌ఎస్ ప్లీనరీ ఏర్పాట్లు పూర్తి: నాయిని | TRS arrangements in plenary: Naini | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్ ప్లీనరీ ఏర్పాట్లు పూర్తి: నాయిని

Apr 23 2015 1:33 AM | Updated on Sep 3 2017 12:41 AM

టీఆర్‌ఎస్ ప్లీనరీ ఏర్పాట్లు పూర్తి: నాయిని

టీఆర్‌ఎస్ ప్లీనరీ ఏర్పాట్లు పూర్తి: నాయిని

టీఆర్‌ఎస్ ప్లీనరీ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ప్లీనరీకి హాజరయ్యే .....

హైదరాబాద్ : టీఆర్‌ఎస్ ప్లీనరీ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం, ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. పార్కింగ్ కమిటీకి చైర్మన్‌గా ఉన్న ఆయన బుధవారం తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు.

ప్లీనరీ జరిగే ఎల్‌బీ స్టేడియం వద్దకు ప్రతినిధుల వాహనాలను అనుమతించడం లేదని చెప్పారు. నగరంలో ఎనిమిదిచోట్ల పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశామని వివరించారు. కనీసం 50 వేల మందికి సరిపోయేలా నిజాం కాలేజీ మైదానంలో భోజన ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement