పాత్రికేయుల కోసం ట్రిపుల్ బెడ్‌రూం కాలనీలు | Triple bedroom colonies for journalists | Sakshi
Sakshi News home page

పాత్రికేయుల కోసం ట్రిపుల్ బెడ్‌రూం కాలనీలు

Feb 8 2016 5:33 AM | Updated on Sep 3 2017 5:08 PM

పాత్రికేయుల కోసం ట్రిపుల్ బెడ్‌రూం కాలనీలు

పాత్రికేయుల కోసం ట్రిపుల్ బెడ్‌రూం కాలనీలు

పాత్రికేయుల కోసం ట్రిపుల్ బెడ్‌రూమ్ కాలనీలు నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ వెల్లడించారు.

 ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ

 చిట్యాల: పాత్రికేయుల కోసం ట్రిపుల్ బెడ్‌రూమ్ కాలనీలు నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ వెల్లడించారు. ఆదివారం నల్లగొండ జిల్లా చిట్యాలలో విలేకరులతో ఆయన మాట్లాడారు. మొదటి విడతలో హైదరాబాద్, వరంగల్, మెదక్ జిల్లాల్లో ట్రిపుల్ బెడ్‌రూం కాలనీలు నిర్మించనున్నట్లు చెప్పారు.

ఈ మేరకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు, హెల్త్‌కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. హెల్త్ కార్డుల కోసం రెండు వేల మందికి మాత్రమే ఆమోదం జరిగిందని, మిగిలిన 24 వేల మంది జర్నలిస్టులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని అల్లం పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement