అటవీ గెస్ట్‌హౌస్‌ను ముట్టడించిన గిరిజనులు | tribles dharna at forest guest house | Sakshi
Sakshi News home page

అటవీ గెస్ట్‌హౌస్‌ను ముట్టడించిన గిరిజనులు

Jun 17 2015 2:10 PM | Updated on Sep 3 2017 3:53 AM

అటవీ గెస్ట్‌హౌస్‌ను ముట్టడించిన గిరిజనులు

అటవీ గెస్ట్‌హౌస్‌ను ముట్టడించిన గిరిజనులు

అటవీశాఖ అధికారులు తమపై పెట్టిన తప్పుడు కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండల కేంద్రంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసీ ఆధ్వర్యంలో గిరిజనులు బుధవారం ప్రదర్శన నిర్వహించారు.

అశ్వారావుపేట: అటవీశాఖ అధికారులు తమపై పెట్టిన తప్పుడు కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండల కేంద్రంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసీ ఆధ్వర్యంలో గిరిజనులు బుధవారం ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అటవీశాఖ గెస్ట్‌హౌస్‌ను ముట్టడించారు. అనంతరం చెక్‌పోస్ట్ వద్ద ధర్నా నిర్వహించారు. అటవీశాఖ అధికారులు అనవసరంగా గిరిజనులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, వాటిని ఎత్తివేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసీ జిల్లా కార్యదర్శి రంగారావు డిమాండ్ చేశారు. మంగళవారం మండల పరిధిలోని బండారుగుంపు వద్ద అటవీశాఖ అధికారులపై పోడు సాగుదారులు దాడి చేయడం... దానిపై కేసు నమోదు చేయడం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement