ధర్మపురి పుష్కరాలకు లక్షలాది మంది బస్సులు, కార్లు, ఇతర వాహనాల్లో తరలిరావడంతో శనివారం...
రాయికల్/ధర్మారం/వెల్గటూరు : ధర్మపురి పుష్కరాలకు లక్షలాది మంది బస్సులు, కార్లు, ఇతర వాహనాల్లో తరలిరావడంతో శనివారం చొప్పదండి, ధర్మారం, వెల్గటూరు, రాయపట్నం నుంచి ధర్మపురి వరకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. జగిత్యాల, ధర్మారం వెళ్లే రహదారు ల్లో వాహనాలు బారులుతీరారుు. కరీంనగర్ నుంచి ధర్మపురికి రావడానికి ఐదు గంటలకు పైగా పట్టింది. మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్ ధర్మపురికి కారులో బయలుదేరగా ట్రా ఫిక్ జామ్‌లో ఇరుక్కోవడంతో కరీంనగర్ ఎమ్మె ల్యే గంగుల కమలాకర్‌తో బుల్లెట్లపై కోటిలింగాల చేరుకున్నారు.
రాత్రి 7.30 గంటలకు కోటిలింగా ల వద్ద తీవ్ర ట్రాఫిక్ జామ్ కావడంతో వర్షంలోనూ లాఠీలు, వాకీటాకీలు పట్టుకొని పోలీసు సిబ్బందికి సూచనలిస్తూ ట్రాఫిక్‌ను నియంత్రిం చారు. కోటలింగాల నుంచి ధర్మారం వరకూ ట్రాఫిక్ జామ్ కావడంతో మంత్రులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. ధర్మారం చేరుకుని రోడ్డు క్లియర్‌గా ఉన్నప్పటికీ వాహనాలు ఎందుకు నిలి చిపోతున్నాయంటూ విధులు నిర్వహిస్తున్న కరీం నగర్ ట్రాఫిక్ సీఐ మహేష్, వీణవంక ఎస్సై కిరణ్‌పై హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేడు వన్‌వేలో రాకపోకలు
భక్తుల రద్దీ దృష్ట్యా ఆదివారం ధర్మపురికి వన్‌వే ఏర్పాటు చేశారు. జగిత్యాల మీదుగా ధర్మపురికి వచ్చేవారు తిరిగి కరీంనగర్ మీదుగా వెళ్లాలని అధికారులు సూచించారు.