నేడు కేసీఆర్ ప్రచారం | Today KCR campaign | Sakshi
Sakshi News home page

నేడు కేసీఆర్ ప్రచారం

Apr 22 2014 2:35 AM | Updated on Aug 15 2018 9:06 PM

నేడు కేసీఆర్ ప్రచారం - Sakshi

నేడు కేసీఆర్ ప్రచారం

ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు.

  • భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, పాలకుర్తి, డోర్నకల్ నియోజకవర్గాల్లో సభలు
  •  వరంగల్, న్యూస్‌లైన్: ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఐదు అసెం బ్లీ నియోజకవర్గాల్లో జరిగే సభలకు ఆయన హాజరుకానున్నారు. టీఆర్‌ఎస్ తొలి దశలో మడికొండలో బహిరంగ సభ నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కించింది. ప్రచారంలో మిగిలిన పక్షాల కంటే ముందు వరుసలో నిలిచింది.

    ఈ ఎన్నికల్లో తొలిసారిగా ఒంటరి పోరుకు సిద్ధమైన గులాబీ దళం.. గెలుపుపై భారీ అంచనాతో ముందుకు సాగుతోంది. అభ్యర్థుల విజయంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. సెగ్మెంట్‌కు ఒక సభ చొప్పున నిర్వహించనుంది. పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా పాల్గొనే విధంగా నాయకులు సభలు ఏర్పాటు చేశారు. కేసీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 12గంటలకు భూపాలపల్లికి చేరుకుంటారు.

    మధ్యాహ్నం 12.40 గంటలకు ములుగులో, 1.30 గంటలకు మహబూబాబాద్‌లో, 2.20 గంటలకు పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో, 3గంటలకు డోర్నకల్ నియోజకవర్గం మరిపెడలో జరిగే సభల్లో ప్రసంగిస్తారు. కేసీఆర్ పాల్గొనే సభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు కోరారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement