నేడే జేఈఈ మెయిన్‌  | Today is JEE Main exam | Sakshi
Sakshi News home page

నేడే జేఈఈ మెయిన్‌ 

Apr 8 2018 3:24 AM | Updated on Apr 8 2018 3:24 AM

Today is JEE Main exam - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎక్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్‌ రాత పరీక్ష ఆదివారం జరగనుంది. బీఈ/బీటెక్‌లో ప్రవేశాల కోసం ఉదయం 9:30 గంటల నుంచి పేపరు–1, బీఆర్క్‌/బీప్లానింగ్‌లో ప్రవేశాల కోసం మధ్యాహ్నం 2 గంటల నుంచి పేపరు–2 పరీక్షలు జరుగనున్నాయి.

ఈ పరీక్షలకు దేశ వ్యాప్తంగా దాదాపు 13 లక్షల మంది విద్యార్థులు హాజరు కానుండగా, తెలంగాణ నుంచి 74,580 మంది హాజరుకానున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్, ఖమ్మంలో 115 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement