గుప్త నిధుల కోసం తవ్వకాలు | Thinks for hidden treasures | Sakshi
Sakshi News home page

గుప్త నిధుల కోసం తవ్వకాలు

Apr 9 2015 11:03 AM | Updated on Sep 3 2017 12:05 AM

మెదక్ జిల్లాలోని నర్సాపూర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో బుధవారం రాత్రి గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు స్థానికులు గుర్తించారు.

మెదక్: మెదక్ జిల్లాలోని నర్సాపూర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో బుధవారం రాత్రి గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు స్థానికులు గుర్తించారు. నాలుగు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో కొంత మంది దుండగులు ఒక బాలుణ్ని గుప్త నిధుల కోసం బలి ఇవ్వడానికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. తాజాగా అదే ప్రాంతంలో మరోసారి తవ్వకాలు చేపట్టారనే విషయం తెలియడంతో పోలీసుఅధికారుల అలసత్వంతోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement