లక్షణంగా దొరికిపోయారు | thieves arrested in warangal | Sakshi
Sakshi News home page

లక్షణంగా దొరికిపోయారు

Jul 31 2015 9:28 PM | Updated on Aug 28 2018 7:30 PM

వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో డ్రిప్ వైర్లు దొంగిలించిన వ్యక్తులు పోలీసులకు దొరికిపోయారు.

నర్సంపేట: వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో డ్రిప్ వైర్లు దొంగిలించిన వ్యక్తులు పోలీసులకు దొరికిపోయారు. శుక్రవారం వారు దొంగలించిన వైర్లను అమ్మేందుకు యత్నించి నర్సంపేటలో పోలీసులకు చిక్కారు. వారంతా నల్లగొండ జిల్లా నకిరేకల్ మండల కేంద్రానికి చెందిన వారిగా పోలీసుల విచారణలో తేలింది. వైర్ల విలువ రూ.1.50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నకిరేకల్లుకు చెందిన రావుల రాజేష్, సారంగి శ్రీను, బాలరాజు, యాదగిరిలు కలిసి ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement