వైన్స్ షాపులో చోరీ | theft in wine shop in shamshabad | Sakshi
Sakshi News home page

వైన్స్ షాపులో చోరీ

Dec 9 2015 10:17 AM | Updated on Mar 28 2018 11:26 AM

రంగారెడ్డి జిల్లాలో మంగళవారం అర్థరాత్రి ఓ వైన్స్షాపులో చోరి జరిగింది.

శంషాబాద్: రంగారెడ్డి జిల్లాలో మంగళవారం అర్థరాత్రి ఓ వైన్స్షాపులో చోరి జరిగింది. శంషాబాద్లోని శ్రీ వెంకటేశ్వర వైన్స్‌ షాపులో గుర్తుతెలియని దుండుగులు వైన్స్ షాపు తాళాలు పగలగొట్టి దోపిడి పాల్పడ్డారు. రూ. 25 వేల నగదుతో పాటు విలువైన 20 మద్యం బాటిళ్లను దొంగలు ఎత్తుకెళ్లారు. బుధవారం ఉదయం గుర్తించిన వైన్స్ షాపు యజమాని పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement