హార్డ్‌వేర్ షాపులో భారీ చోరీ | theft in hardware shop at adilabad district | Sakshi
Sakshi News home page

హార్డ్‌వేర్ షాపులో భారీ చోరీ

Feb 24 2016 5:10 PM | Updated on Aug 17 2018 2:53 PM

ఆదిలాబాద్ జిల్లాలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. మంచిర్యాల పట్టణంలోని సీసీసీ సెంటర్ వద్ద మంగళవారం రాత్రి ఓ హార్డ్‌వేర్ షాపులో చోరీ

మంచిర్యాల: ఆదిలాబాద్ జిల్లాలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. మంచిర్యాల పట్టణంలోని సీసీసీ సెంటర్ వద్ద మంగళవారం రాత్రి  ఓ హార్డ్‌వేర్ షాపులో చోరీకు పాల్పడ్డారు. దుండగులు షాపు షట్టర్ పగులగొట్టి రూ. 4.70 లక్షల నగదును దోచుకెళ్లారు. బుధవారం ఉదయం యజమాని షాపు తెరవడానికి వెళ్లగా షట్టర్ పగులగొట్టి ఉండటాన్ని గమనించి లోపలికి వెళ్లి పరిశీలించారు. నగదు కనిపించకపోయేసరికి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement