ట్రాక్టర్ బోల్తా.. యువకుడి మృతి | The tractor roll over, the young man killed | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ బోల్తా.. యువకుడి మృతి

Mar 13 2016 1:40 AM | Updated on Sep 2 2018 3:43 PM

ట్రాక్టర్ బోల్తా.. యువకుడి మృతి - Sakshi

ట్రాక్టర్ బోల్తా.. యువకుడి మృతి

మండలంలోని పూసాయి వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై ఇసుక, ఇనుప రాడ్ల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడి కౌట .........

జైనథ్ : మండలంలోని పూసాయి వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై ఇసుక, ఇనుప రాడ్ల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడి కౌట గ్రామానికి చెందిన బౌనే పరశురాం(25) దుర్మర ణం చెందాడు. ఈ ఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. పో లీసులు, స్థానికుల కథనం ప్రకారం... పరశురాం తన పక్క గ్రామం అయిన సావాపూర్‌కు చెందిన తింగిని రవి అనే యాజమానికి చెందిన ట్రాక్టర్‌పై వెళ్లాడు. ఆదిలాబాద్‌లో ఇసుక, ఇనుప రాడ్లు ట్రాక్టర్‌లో ఎక్కించుకుని కౌటకు బయల్దేరాడు.

మార్గమధ్యలో పూసాయి వద్ద ట్రాక్టర్ ట్రాలీ ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో పరశురాం ట్రాలీ కింద ఇరుక్కపోయి ఇసుకలో కురుకుపోయాడు. ఊపిరి ఆడక అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసు లు స్థానికుల సహాయంలో శవాన్ని బయటకు తీయగా మొహం మొత్తం రక్తంతో నిండిపోయినట్లు గుర్తించారు. కాగా, పరశురాం ట్రాక్టర్ డ్రైవర్‌గా వెళ్లాడో, క్లీనర్‌గా వెళ్లాడో స్పష్టంగా తెలియరాలేదని, సదరు ట్రాక్టర్ యజమానికి ఫోన్ చేయగా అందుబాటులోకి లేరని ఎస్సై పులయ్య తెలిపారు. కుటుంబసభ్యుల ఫి ర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఆయ న స్పష్టం చేశారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement