సుస్థిరపాలన బీజేపీతోనే సాధ్యం | the stability ruling possible with BJP | Sakshi
Sakshi News home page

సుస్థిరపాలన బీజేపీతోనే సాధ్యం

Apr 1 2014 2:45 AM | Updated on Mar 29 2019 9:24 PM

సుస్థిరపాలన బీజేపీతోనే సాధ్యం - Sakshi

సుస్థిరపాలన బీజేపీతోనే సాధ్యం

దేశంలో సుస్థిర పాలన బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి అన్నారు.

నిజామాబాద్ రూరల్, న్యూస్‌లైన్: దేశంలో సుస్థిర పాలన బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి అన్నారు. దేశంలో,రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోతామనే  భయంతో ఎన్నికలు నిర్వహించేందుకు ముందుకు రాలేదని, కేవలం కోర్టు ఆదేశాల మేరకే ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోందని విమర్శించారు.
 
నిజామాబాద్ మండలం ముబారక్‌నగర్, గుండారం, ముదక్‌పల్లి, గూపన్‌పల్లి, మల్కాపూర్, లక్ష్మాపూర్  గ్రామాలలో సోమవారం జెడ్పీటీసీ బీజేపీ అభ్యర్థి ఈర్ల వసంత ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బీజేపీకి  ఓటేసి వసంతను గెలిపించాలని కోరారు. దేశ ప్రజలు నరేంద్రమోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. కేంద్రంలో, రాష్ర్టంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామాల్లో బీజేపీకి రోజురోజుకు ప్రజాదరణ పెరుగుతోందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలు పెంచి సామాన్యుల నడ్డివిరిచిందన్నారు. ప్రచారంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గాదె  కృష్ణ, నిజామాబాద్ జిల్లా కిసాన్ మోర్చ కార్యదర్శి సూర్యారెడ్డి, గిరిజన మోర్చ జిల్లా అధ్యక్షుడు రాం సింగ్, మండల అధ్యక్షుడు ఈగ రాజేశ్వర్ రెడ్డి, పద్మారె డ్డి, సాయిలు,  పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి, పార్టీ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement