విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి | The person killed in electric shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

Dec 5 2015 2:19 PM | Updated on Sep 5 2018 2:26 PM

కరీంనగర్ జిల్లా వెలగటూరు మండలం ముక్కోటిరావుపేటలో శనివారం కరిడె ఆనందం(35) అనే వ్యక్తి విద్యుదాఘాతంతో మృతిచెందాడు.

కరీంనగర్ జిల్లా వెలగటూరు మండలం ముక్కోటిరావుపేటలో శనివారం కరిడె ఆనందం(35) అనే వ్యక్తి విద్యుదాఘాతంతో మృతిచెందాడు. ఇంటి ముందు బట్టలు ఆరేస్తుండగా వైరుకు కరెంట్ సరఫరా కావడంతో ప్రమాదం బారిన పడ్డాడు.  మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తడి బట్టలను ఇనుప వైరుపై ఆరేస్తుండగా కరెంట్ షాక్ తగిలి ఆనందం మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



 

Advertisement
 
Advertisement
Advertisement