వ్యక్తి అనుమానాస్పద మృతి.. | The mysterious death of a person .. | Sakshi
Sakshi News home page

వ్యక్తి అనుమానాస్పద మృతి..

Mar 14 2016 6:07 PM | Updated on Sep 3 2017 7:44 PM

ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలం ఎనగండ్ల గ్రామ శివారులో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది.

- ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన
కొల్చారం(మెదక్)

ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలం ఎనగండ్ల గ్రామ శివారులో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. మెదక్ రూరల్ సీఐ రామక్రిష్ణ, కొల్చారం ఎస్సై రమేష్‌నాయక్ గ్రామస్థుల కథనం ప్రకారం... ఎనగండ్ల గ్రామానికి చెందిన మంగలి గణేష్(35) ఐదేళ్లుగా భార్య లలిత, ఇద్దరు కుమారులతో కలిసి పటాన్ చెరువుకు సమీపంలోని బీరంగూడలో కూలిపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. స్వగ్రామంలోని సొంతిల్లు కూలిపోవటంతో కొత్త ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు పెట్టి వస్తానంటూ నాలుగు రోజుల క్రితం బీరంగూడ నుంచి ఎనగండ్లకు వెళ్లాడు.

మూడు రోజులవుతున్నా భర్త జాడ కానరాకపోవడం, ఫోన్‌చేసినా సమాచారం లేకపోవడంతో లలిత పిల్లలతో కలిసి ఆదివారం ఎనగండ్ల గ్రామానికి చేరుకుంది. ఈ క్రమంలోనే గ్రామ శివారులోని దామర చెరువు వద్ద పొదల్లో గణేష్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులు అక్కడికి చేరుకొని గణేష్ మృతదేహాన్ని పరిశీలించారు. గణేష్ మెడ, పొట్ట భాగంలో కత్తిపోట్ల ఆనవాళ్లున్నాయి. డ్వాగ్‌స్వ్కాడ్‌ను రప్పించగా అది మృతదేహం వద్ద నుంచి లలిత వద్దకు వచ్చి ఆగిపోయింది.

ఈ మేరకు ఎస్సై రమేష్‌నాయక్ కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement