అప్పుల బాధ తాళలేక... | The farmer commits suicide | Sakshi
Sakshi News home page

అప్పుల బాధ తాళలేక...

Nov 28 2015 4:53 PM | Updated on Oct 1 2018 2:36 PM

అప్పుల బాధ తాళలేక మరో రైతన్న ప్రాణాలు విడిచాడు.

అప్పుల బాధ తాళలేక మరో రైతన్న ప్రాణాలు విడిచాడు. ఈ విషాదం ఆదిలాబాద్ జిల్లా కానాపూర్ మండలం రాజల గ్రామంలో శనివారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన ధర్మన్న (49) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో పెట్టుబడుల కోసం 4లక్షల రూపాయలు అప్పు చేశాడు.

అది తీర్చే దారి కానరాక పోవడంతో ఈ నెల 25న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇది గమనించిన స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం మద్యాహ్నం ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement