మరో అన్నదాత ఆత్మహత్య | The farmer commits suicide | Sakshi
Sakshi News home page

మరో అన్నదాత ఆత్మహత్య

Oct 26 2015 4:29 PM | Updated on Nov 6 2018 7:56 PM

అప్పులబాధ భరించలేక పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు

అప్పులబాధ భరించలేక పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మేళ్ల చెరువు మండలం ఎల్లటూరు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బంటు కిష్టయ్య(45) తనకున్న ఐదెకరాల భూమిలో పత్తి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఈ క్రమంలో పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పు పెరిగి పోవడంతో వాటిని తీర్చే దారి కానరాక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement