అప్పుల బాధ తాళలేక... | The farmer commits suicide | Sakshi
Sakshi News home page

అప్పుల బాధ తాళలేక...

Oct 24 2015 12:52 PM | Updated on Oct 1 2018 2:36 PM

మరో అన్నదాత అప్పుల భారంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అప్పుల బాధ తాళలేక అన్నదాత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా వెల్దండ మండలం అజిల్లాపూర్‌లో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... గ్రామానికి చెందిన బంగారి ఎల్లయ్య 47 తనకున్న ఏడు ఎకరాల భూమిలో పత్తిపంట సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

 

ఈ క్రమంలో సాగు కోసం కొత్తగా అప్పు తెచ్చి రెండు బోర్లు వేశాడు.. కానీ వాటిలో నీళ్లు పడకపోవడంతో.. పంట ఎండిపోయింది. దీంతో మనస్తాపం చెందిన ఎల్లయ్య పంట చేనులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సుమారూ రూ. 5 లక్షల వరకు అప్పులు ఉండటంతోటే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement