అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య | Ap Farmer Dies by Suicide Due to Crop Loss and Debt | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య

Apr 6 2026 5:09 AM | Updated on Apr 6 2026 5:09 AM

Ap Farmer Dies by Suicide Due to Crop Loss and Debt

పెద్దవడుగూరు: అప్పు­ల బాధ తాళలేక రైతు బలవన్మరణానికి పాల్ప­డిన ఘటన అనంతపు­రం జిల్లా పెద్దవడుగూ­రు మండలం భీమునిపల్లిలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన బసిరెడ్డి చిన్నారెడ్డి(28) తనకున్న 12 ఎకరాల పొలంలో సాగు చేస్తున్నాడు. పంటలు, కుటుంబ పోషణ కోసం బ్యాంకులు, ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.60 లక్ష­ల దాకా అప్పులు చేశాడు.

రుణదాతల నుంచి ఒత్తిడి తీవ్రం కావడం, చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక భరోసా లేకపోవడంతో జీవితంపై విరక్తి చెందాడు. ఈ క్రమంలో ఆదివారం గ్రామ సమీపంలో చెట్టు­కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement