జోగిపేటలో ఉద్రిక్తత | Tension in Jogipet | Sakshi
Sakshi News home page

జోగిపేటలో ఉద్రిక్తత

Oct 5 2015 3:31 PM | Updated on Oct 16 2018 3:12 PM

జోగిపేట - సంగారెడ్డి జాతీయ రహదారి పక్కన మార్కెట్ కమిటీ ముందు ఉన్న వడ్డెరుల గుడిసెల తొలగింపు ఉద్రిక్తతకు దారి తీసింది.

జోగిపేట - సంగారెడ్డి జాతీయ రహదారి పక్కన మార్కెట్ కమిటీ ముందు ఉన్న వడ్డెరుల గుడిసెల తొలగింపు ఉద్రిక్తతకు దారి తీసింది. సోమవారం ఉదయం పోలీసు, రెవెన్యూ, మార్కెటింగ్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో గుడిసెల తొలగింపు జరిగింది. దీంతో నిరాశ్రయులైన 30 కుటుంబాలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి.

తమకు ప్రత్యామ్నయ స్థలం చూపించకుండా.. తమ గుడిసెలు కూల్చేశారంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే.. వీరికి వేరొక చోట స్థలాలు చూపించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తహశీల్దార్ హామీ ఇచ్చారు. భారీ పోలీసు పహారా.. రెండు జేసీబీలు కార్యక్రమంలో పాల్గొనటంతో.. పెద్ద ఎత్తున రహదారిపై రాకపోకలకు అంతరాయం కలిగింది.
 

Advertisement
 
Advertisement
Advertisement