రాహుల్ పర్యటనలో కిందపడిన ఎమ్మెల్యే | tension at rahul tour | Sakshi
Sakshi News home page

రాహుల్ పర్యటనలో కిందపడిన ఎమ్మెల్యే

May 14 2015 11:08 PM | Updated on Jun 4 2019 5:04 PM

రైతు భరోసా కోసం ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిన రాహుల్ గాంధీ గురువారం రాత్రి నిర్మల్ చేరుకున్నారు. ఈ సందర్భంగా కాస్తంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

ఆదిలాబాద్: రైతు భరోసా కోసం ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిన రాహుల్ గాంధీ గురువారం రాత్రి నిర్మల్ చేరుకున్నారు. ఈ సందర్భంగా కాస్తంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులకు నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తోపులాట జరిగి ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి, పలువురు నేతలు కిందపడిపోయారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా నేతలను దిగ్విజయ్ సింగ్ సముదాయించారు. ఈ పర్యటనలో జానారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ భద్రత కల్పించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వాని ఉందని చెప్పారు. షెడ్యూల్ ప్రకారం రైతు భరోసా యాత్ర కొనసాగుతుందని అన్నారు. వందలాది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్లే తెలంగాణలో రాహుల్ పాదయాత్ర చేస్తున్నారని ఆయన సాక్షికి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement