జూన్ 3న తెలంగాణ విద్రోహ దినం | telangana vidhraha Day on june 3rd | Sakshi
Sakshi News home page

జూన్ 3న తెలంగాణ విద్రోహ దినం

May 27 2014 2:10 AM | Updated on Sep 2 2017 7:53 AM

జూన్ 3న తెలంగాణ విద్రోహ దినం

జూన్ 3న తెలంగాణ విద్రోహ దినం

తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిని దళితుడిని చేస్తానని ప్రకటించి న కేసీఆర్ తెలంగాణ ప్రాంతంలోని దళి తులందరినీ నమ్మించి మోసం చేశారని మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆరోపించారు.

ఎమ్మెస్పీ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
కొల్లాపూర్, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిని దళితుడిని చేస్తానని ప్రకటించిన కేసీఆర్ తెలంగాణ ప్రాంతంలోని దళి తులందరినీ నమ్మించి మోసం చేశారని మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ఆదివారం ఆయన కొల్లాపూర్‌లో విలేకరులతో మాట్లాడారు. 2001లో టీఆర్‌ఎస్ ను స్థాపించిన కేసీఆర్ 2002 నుంచి దళిత ముఖ్యమంత్రి అనే నినాదాన్ని అందుకున్నారని గుర్తుచేశారు.

దళితులను మోసం చేసిన కేసీఆర్ నైజం చరిత్రలో నిలిచిపోయే విధంగా జూన్ 3న తెలంగాణ విద్రోహ దినం కార్యక్రమం నిర్వహించనున్నట్లు మందకృష్ణ తెలిపారు. ప్ర తి సంవత్సరం జూన్ 3న ఈ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణలో ని ప్రతి గ్రామంలో కూడా విద్రోహ దినం కార్యక్రమాన్ని నిర్వహించాలని ఎమ్మెస్పీ శ్రేణులకు సూచించారు. తెలంగాణ చరి త్ర ఉన్నంత కాలం దళితులకు కేసీఆర్ చేసిన మోసం ఆయనను నీడలా వెంటాడుతుంద న్నారు. తెలంగాణలో 20శాతం జనాభా ఉన్న దళితుల్లో 40శాతం మంది తెలంగాణ కోసం త్యాగాలు చేశారని, 90శాతానికి పైగా దళిత కళాకారులు ఉద్యమాన్ని ముందుండి నడిపించారని   వివరించారు.

వర్గీకరణపై ఉద్యమం ఆగదు
వర్గీకరణ ఉద్యమాన్ని కొనసాగిస్తామని మందకృష్ణ మాదిగ వెల్లడించారు. ఆది వారం ఆయన కొల్లాపూర్ మండలంలోని కుడికిళ్లలో ఓ వివాహ కార్యక్రమానికి హా జరయ్యారు. అనంతరం కొల్లాపూర్‌లో విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలో అధికారంలోకొచ్చిన బీజేపీతోపాటు, ఆం ధ్రప్రదేశ్‌లో అధికారంలో కొచ్చిన టీడీపీలు వర్గీకరణకు అనుకూలమైన పార్టీలు అన్నారు. టీడీపీ హయాంలో వర్గీకరణ కొనసాగిందని వివరించారు. చంద్రబా బు తమకు సహజ మిత్రుడన్నారు.

జూన్ మొదటి వారంలో వర్గీకరణ అంశంపై జాతీయ స్థాయి సమావేశం ఏర్పాటుచేసి, ఉద్యమం కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కమిటీలను వేయనున్నట్లు తెలిపా రు. వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ తమను మోసం చేసిందని, టీడీపీ, బీజేపీలు న్యాయం చేస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్ మోసంపై ఈనెల 27న హైదరాబాద్‌లో దళిత కుల సంఘాలతో, 31న దళిత మేధావులతో స మావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. టీ ఆర్‌ఎస్, కేసీఆర్ వైఖరి ని నిరసిస్తూ పోరాటాలు కొనసాగిస్తామన్నారు.

 జూన్ 2 న అమరుల త్యాగాలను స్మరిస్తూ తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు జరుపుకుం టామని, జూన్ 3న కేసీఆర్ చేసిన మోసానికి నిరసనగా తెలంగాణ విద్రోహదినం నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో వీహెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు అందె రాంబాబు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కో ఆర్డినేటర్,కోళ్ల వె ంకటేష్‌మాదిగ, ఎంఎస్‌పీ జిల్లా సమన్వయకర్త సింగిరెడ్డి పరమేశ్వర్‌మాదిగ, నాయకులు జంగయ్య, మధునాయుడు, కోళ్ల శివ, మంద నర్సింహ్మ, పుట్టపాగ రాము, నిరంజన్ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement