తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేల అరెస్ట్ | Telangana TDP MLAs Arrest | Sakshi
Sakshi News home page

తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేల అరెస్ట్

Mar 24 2015 9:34 PM | Updated on Aug 10 2018 7:19 PM

తెలంగాణ శాసనసభ స్పీకర్ కార్యాలయం వద్ద బైఠాయించిన టీడీపీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ స్పీకర్ కార్యాలయం వద్ద  బైఠాయించిన టీడీపీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఉదయం 9 గంటల నుంచి  అక్కడే బైటాయించారు. స్పీకర్ మధుసూదనా చారి తన చాంబర్ నుంచి బయటకు వెళ్లిన తరువాత కూడా రాత్రంతా ఇక్కడే ఉంటామని టీడీపీ ఎమ్మెల్యేలు అక్కడే బైఠాయించారు. దాంతో మార్షల్స్ భారీగా మోహరించారు. సభలో ప్రజా సమస్యలు లేవనెత్తకుండా తమ గొంతు నొక్కారని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆరోపించారు. జాతీయ గీతం నెపంతో సస్సెండ్ చేస్తే క్షమాపణ చెబుతామంటూ స్పీకర్కు లేఖ రాసినట్లు తెలిపారు. సభలోకి అనుమతించాలని తమతోపాటు మిగిలిన పక్షాలు కోరినా పట్టించుకోవడంలేదన్నారు. తమ డిమాండ్లపై సమాధానం చెప్పేవరకు స్పీకర్ చాంబర్ వద్ద నిరసన దీక్ష కొనసాగిస్తామని చెప్పారు. అక్కడ నుంచి కదలక పోవడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఆ తరువాత వారిని టీడీపీ కార్యాలయానికి తరలించారు.

ఇదిలా ఉండగా, స్పీకర్ చాంబర్ వద్ద టీడీపీ నేతలు గందరగోళం సృష్టిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాలరాజు విమర్శించారు. జాతీయ గీతాన్ని అవమానించిన టీడీపీకి బీజేపీ మద్దతు పలకడం దురదృష్టకరమన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేవిధంగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారన్నారు. తలసాని రాజీనామా స్పీకర్ పరిధిలో ఉందని ఆయన తెలిపారు. తెలంగాణలో టీడీపీ ఉనికి కోల్పోతుందని కొత్త డ్రామాలు ఆడుతున్నారని బాలరాజు విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement