breaking news
speaker chamber
-
తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేల అరెస్ట్
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ స్పీకర్ కార్యాలయం వద్ద బైఠాయించిన టీడీపీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఉదయం 9 గంటల నుంచి అక్కడే బైటాయించారు. స్పీకర్ మధుసూదనా చారి తన చాంబర్ నుంచి బయటకు వెళ్లిన తరువాత కూడా రాత్రంతా ఇక్కడే ఉంటామని టీడీపీ ఎమ్మెల్యేలు అక్కడే బైఠాయించారు. దాంతో మార్షల్స్ భారీగా మోహరించారు. సభలో ప్రజా సమస్యలు లేవనెత్తకుండా తమ గొంతు నొక్కారని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆరోపించారు. జాతీయ గీతం నెపంతో సస్సెండ్ చేస్తే క్షమాపణ చెబుతామంటూ స్పీకర్‌కు లేఖ రాసినట్లు తెలిపారు. సభలోకి అనుమతించాలని తమతోపాటు మిగిలిన పక్షాలు కోరినా పట్టించుకోవడంలేదన్నారు. తమ డిమాండ్లపై సమాధానం చెప్పేవరకు స్పీకర్ చాంబర్ వద్ద నిరసన దీక్ష కొనసాగిస్తామని చెప్పారు. అక్కడ నుంచి కదలక పోవడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఆ తరువాత వారిని టీడీపీ కార్యాలయానికి తరలించారు. ఇదిలా ఉండగా, స్పీకర్ చాంబర్ వద్ద టీడీపీ నేతలు గందరగోళం సృష్టిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాలరాజు విమర్శించారు. జాతీయ గీతాన్ని అవమానించిన టీడీపీకి బీజేపీ మద్దతు పలకడం దురదృష్టకరమన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేవిధంగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారన్నారు. తలసాని రాజీనామా స్పీకర్ పరిధిలో ఉందని ఆయన తెలిపారు. తెలంగాణలో టీడీపీ ఉనికి కోల్పోతుందని కొత్త డ్రామాలు ఆడుతున్నారని బాలరాజు విమర్శించారు. -
స్పీకర్ ఛాంబర్ వద్ద ఎమ్మెల్యేల భైఠాయింపు
హైదరాబాద్ : తెలంగాణ ప్రాంత కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సోమవారం స్పీకర్ ఛాంబర్ ఎదుట బైఠాయించారు. తక్షణమే బీఏసీ ఏర్పాటు చేసి బిల్లుపై చర్చ జరపాలంటూ డిమాండ్ చేశారు. విభజన బిల్లుకు సహకరించాలని వారు నినాదాలు చేశారు. మరోవైపు బిల్లును సభలో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ సీమాంధ్ర ప్రాంత టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. కాగా సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు... స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో ఉన్నారు.