తెలంగాణ ప్రాంత కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సోమవారం స్పీకర్ ఛాంబర్ ఎదుట బైఠాయించారు.
హైదరాబాద్ : తెలంగాణ ప్రాంత కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సోమవారం స్పీకర్ ఛాంబర్ ఎదుట బైఠాయించారు. తక్షణమే బీఏసీ ఏర్పాటు చేసి బిల్లుపై చర్చ జరపాలంటూ డిమాండ్ చేశారు. విభజన బిల్లుకు సహకరించాలని వారు నినాదాలు చేశారు.
మరోవైపు బిల్లును సభలో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ సీమాంధ్ర ప్రాంత టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. కాగా సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు... స్పీకర్పై అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో ఉన్నారు.