
సాక్షి, పల్నాడు జిల్లా: మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ గూండాలు బరితెగించారు. జర్నలిస్టుపై టీడీపీ ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. జర్నలిస్టుపై టీడీపీ గూండాలు కర్రలతో దాడి చేశారు. కారంపూడి మండలంలో అక్రమాలపై వార్తలు రాసినందుకు జర్నలిస్ట్‌పై దాడి చేశారు. టీడీపీ గూండాల దాడిలో జర్నలిస్టు లక్ష్మణరావుకు తీవ్రగాయాలయ్యాయి.
జర్నలిస్ట్ లక్ష్మణరావు తలకు బలమైన గాయం కావడంతో గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లక్ష్మణరావుపై తప్పుడు కేసు బనాయించడానికి టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. లక్ష్మణరావు మాట్లాడుతూ.. తెలుగుదేశం నాయకుడు చప్పిడి రాము తనపై కర్రతో దాడి చేశారన్నారు. తాను ఫిర్యాదు చేయడానికి కారంపూడి పోలీస్ స్టేషన్‌కి వెళ్తే.. చప్పిడి శ్రీనుతో పాటు మరో కత్తితో పోలీస్ స్టేషన్‌కి వచ్చి తనపై దాడి చేయడానికి ప్రయత్నించారని లక్ష్మణరావు తెలిపారు. పోలీస్ ఉన్నతాధికారులు కారంపూడి పోలీస్ స్టేషన్‌లో సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తే టీడీపీ నేతల దౌర్జన్యం తెలుస్తుందన్నారు. టీడీపీ నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందని.. కాపాలంటూ లక్ష్మణరావు వేడుకున్నారు.