తెలంగాణలో టీటీడీపీ ఎమ్మెల్యేల బస్సు యాత్ర | Telangana tdp mla bus tour in Hyderabad, Ranga reddy | Sakshi
Sakshi News home page

తెలంగాణలో టీటీడీపీ ఎమ్మెల్యేల బస్సు యాత్ర

Aug 26 2015 11:14 AM | Updated on Aug 11 2018 4:44 PM

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేల బస్సు యాత్ర బుధవారం ప్రారంభమైంది.

హైదరాబాద్: హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేల బస్సు యాత్ర బుధవారం ప్రారంభమైంది. ఈ బస్సు యాత్రలో భాగంగా ఆయా జిల్లాల్లో వివిధ పథకాల కింద పెండింగ్లోని ఇళ్ల నిర్మాణాలను తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు పరిశీలన చేయనున్నారు. కాగా, ఇప్పటివరకూ డబ్బులు కట్టినా ఇళ్లు మంజూరు కానివారు, ఇల్లు పూర్తైనా బిల్లులు రానివారితో వారు మాట్లాడనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement