'తుమ్మల స్వార్ధం కోసమే పార్టీని వీడారు' | telangana tdp leaders take on tummala nageswara rao | Sakshi
Sakshi News home page

'తుమ్మల స్వార్ధం కోసమే పార్టీని వీడారు'

Aug 30 2014 9:25 PM | Updated on Aug 10 2018 8:08 PM

'తుమ్మల స్వార్ధం కోసమే పార్టీని వీడారు' - Sakshi

'తుమ్మల స్వార్ధం కోసమే పార్టీని వీడారు'

టీడీపీ నేత తుమ్మల నాగేశ్వర రావు పార్టీని వీడటంపై ఆ పార్టీ సీనియర్ నేతలు మండిపడుతున్నారు.

హైదరాబాద్: టీడీపీ నేత తుమ్మల నాగేశ్వర రావు పార్టీని వీడటంపై ఆ పార్టీ సీనియర్ నేతలు మండిపడుతున్నారు. ఆయన తన స్వార్థం కోసమే పార్టీని వీడారని తెలంగాణ టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, నర్సారెడ్డిలు విమర్శించారు. ప్రస్తుతం తుమ్మల పార్టీని విడిచి పెట్టి బయటకు వెళ్లడం బాధాకరమన్నారు. తుమ్మలకు టీడీపీ ఎన్నో పదవులు ఇచ్చి గౌరవించిందని స్పష్టం చేశారు. ఆయన చెప్పిన వారికే జిల్లాలో జడ్పీ చైర్మన్, డీసీసీబీ చైర్మన్, జిల్లా అధ్యక్ష పదవులు ఇచ్చారని వారు తెలిపారు. తుమ్మల పార్టీని వీడినా.. కార్యకర్తలు టీడీపీతోనే ఉంటారన్నారు.

 

తుమ్మలతోపాటు ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షుడు కొండబాల, ఎమ్మెల్సీ బాలసాని, డిసిసిబి చైర్మన్ మువ్వ విజయ్ బాబు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కవిత,  తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు నాగచంద్రా రెడ్డి,  జిల్లాలోని మరి కొందరు ముఖ్య నేతలు కూడా టిడిపికి  రాజీనామా చేశారు. దీంతో ఖమ్మం జిల్లాలో టిడిపికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సెప్టెంబరు 5న తుమ్మల, ఆయన అనుచరులు టిఆర్ఎస్లో చేరే అవకాశం ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement