దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ

దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ - Sakshi

 • కోటి రతనాల వీణ.. కొత్త రాష్ట్రమైన వేళ..

 •  ఫలించిన అరవయ్యేళ్ల అస్తిత్వ ఆకాంక్ష..

 •  తెలంగాణ అంతటా ఆనంద హేల

 •  కొలిక్కి వచ్చిన పంపకాలు

 •   నేటి నుంచే విడిగా పాలనకు శ్రీకారం

 •   ఇప్పటికి ఉమ్మడిగానే హైకోర్టు తదితరాలు

 •   టీడీపీ తప్ప అన్ని పార్టీలకూ విడిగా శాఖలు

 •  

   కొత్త పొద్దు పొడిచింది. కోటి ఆశలతో నిరీక్షిస్తున్న తెలంగాణ నేలను కొత్త వేకువ పలకరించింది. కొత్త రాష్ట్రం సాధించిన సంబరంతో కోట్ల ప్రజానీకం పులకరించింది. తెలంగాణ సమాజపు అరవ య్యేళ్ల సుదీర్ఘ అస్తిత్వ పోరాటం ఫలించింది. స్వాభిమానం, స్వపరిపాలన కోసం దశాబ్దాలుగా సాగిన సబ్బండవర్గాల ఉద్యమం లక్ష్యాన్ని చేరింది. అసంఖ్యాకమైన ఆత్మబలిదానాలు, అనేకానేక ఉద్యమ గాయాల సాక్షిగా సువిశాల భారతావనిలో తెలంగాణ అవతరించింది... 29వ రాష్ట్రంగా సగర్వంగా ఉనికిలోకి వచ్చింది. దశాబ్దాలుగా ఊరిస్తున్న బంగరు స్వప్నం నేటితో సాకారమైంది. ఊరూవాడా, పల్లేపట్నం, చిన్నాపెద్దా తేడా లేకుండా అర్ధరాత్రి నుంచే తెలంగాణ సమాజం సంబురాలు జరుపుకుంటూ కొత్త రాష్ట్రానికి, తమ సొంత రాష్ట్రానికి ఘనంగా స్వాగతం పలికింది. ఆనందం అర్ణవమైంది. తెలంగాణ ప్రజల సంబరం అంబరాన్నంటింది!

   

   సాక్షి ప్రధాన ప్రతినిధి: తెలంగాణ ఏర్పడింది! ఆంధ్రప్రదేశ్ నుంచి అధికారికంగా విడిపోరుు కొత్త రాష్ట్రంగా అవతరించింది. భౌగోళికంగా తూర్పు, దక్షిణ దిక్కుల్లో సీవూంధ్ర, పశ్చివూన కర్ణాటక, వుహారాష్ట్ర, ఈశాన్యాన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు సరిహద్దులుగా దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటైంది. ఫైళ్లు, ప్రభుత్వ ఖాతాలు, నిధులు, ఆస్తులు, అప్పులు, ఉద్యోగ గణం, భవనాలు, వాహనాలు, బడ్జెట్ సహా అన్నింటినీ రెండు రాష్ట్రాలూ పంచేసుకున్నారుు. అసెంబ్లీ, శాసనవుండలి, ఏపీ భవన్, సచివాలయుం, వుంత్రుల క్వార్టర్లను సైతం విభజించారు. కాకతీయుుల కళాతోరణం, చార్మినార్ బొవ్ములున్న తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని ఖరారు చేశారు. ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వ వెబ్‌సైట్ ఏర్పడింది. సోవువారం నుంచే తెలంగాణ పాలన విడిగా కొనసాగనుంది. ఉదయుమే గవర్నర్‌గా నరసింహన్, వుుఖ్యవుంత్రిగా కె.చంద్రశేఖరరావు ప్రమాణ స్వీకారం చేస్తారు. కేసీఆర్‌తో పాటు ఆయున వుంత్రివర్గమూ ప్రమాణం చేసి కొలువుదీరుతుంది. తద్వారా తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న రాష్ట్రపతి పాలనను అధికారికంగా తొలగించినట్టవుతుంది. ప్రవూణస్వీకారం జరిగిన వెంటనే కేసీఆర్ వుుఖ్యవుంత్రిగా సచివాలయుంలో బాధ్యతలు స్వీకరిస్తారు. కొత్త రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా రాజీవ్ శర్మ, డీజీపీగా అనురాగ్ శర్మ నియుమితులయ్యూరు. వీరు కూడా సోమవారమే బాధ్యతలు స్వీకరిస్తారు. తెలంగాణకు కేటారుుంచిన ఉద్యోగ గణం సోవువారం నుంచే విధులు నిర్వర్తించటానికి వీలుగా ‘ఆర్డర్ టు వర్క్’ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాల్లోని కలెక్టర్లు, జారుుంట్ కలెక్టర్లు, ఎస్పీలు తదితర అధికారులు, ఉద్యోగులను ఎక్కడివారక్కడే అనే పద్ధతిలో ప్రస్తుతానికి కొనసాగిస్తున్నారు. రాష్ట్ర స్థారుులో పనిచేసే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ తదితర కేంద్ర సర్వీసుల అధికారులనూ తెలంగాణకు విడిగా కేటారుుంచారు. సోవువారం నుంచి వీరంతా కొత్త బాధ్యతల్లో తవుకు కేటారుుంచిన భవనాలు, బ్లాకుల్లో చేరి, ఇంకా మిగిలిపోరుున అప్పగింతల పనులు మరో వారం రోజుల్లో పూర్తి చేయూల్సి ఉంటుంది. దాంతో ఇక తెలంగాణ పాలన బృందం ఏర్పాటు కసరత్తు మొత్తం పూర్తరుునట్టే!

   

   కొన్ని ఉవ్ముడిగానే!

   హైకోర్టుతో పాటు విద్యా సంస్థల్లో ప్రవేశాలు, కొన్ని ప్రభుత్వ సంస్థలు కొంతకాలం పాటు ఉవ్ముడిగానే కొనసాగుతారుు. సా గునీటి వివాదాల తాత్కాలిక సర్దుబాట్లు, పరిష్కారాల కోసం ఓ ఉన్నత స్థారుు కమిటీ వేశారు. తరువాతి దశలో కృష్ణా జలా ల పంపిణీ కోసం ఏర్పడిన బ్రిజేశ్‌కువూర్ ట్రిబ్యునల్ రెండు రాష్ట్రాల నడువు నీటి వనరుల పంపిణీని పూర్తి చేస్తుంది. విద్యుత్తు ప్లాంట్ల కొనుగోలు ఒప్పందాలు కూడా వాటి కాల పరిమితి తీరేదాకా ప్రస్తుత పద్ధతిలోనే కొనసాగుతారుు. గ్రేహౌండ్స్, యూంటీ నక్సల్ విభాగాలు వంటి వి ఇంకా పూ ర్తిగా విడిపోకపోరుునా పోలీసుల విభజన వూత్రం పూర్తరుుం ది. రెండు రాష్ట్రాల నడువు వ్యాపార లావాదేవీలకు సెంట్రల్ సేల్స్ టాక్స్ వసూలు విషయుంలో సందిగ్ధత కొనసాగుతోంది.

   

   అన్నీ వేరుపడ్డట్టే!

   టీడీపీ తప్ప రాష్ట్రంలోని రాజకీయు పార్టీలు సైతం రెండు శాఖలుగా విడిపోయూరుు. టీఆర్‌ఎస్ కేవలం తెలంగాణ ఏర్పాటు ఎజెండాకే పరిమితమై, మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయూన్ని సాధించి తొలిసారిగా తెలంగాణలో అధికారాన్ని హస్తగతం చేసుకున్న రికార్డును తన పేరిట లిఖించుకుంది. కాంగ్రెస్, బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ,సీపీఎం, సీపీఐ, న్యూ డెమొక్రసీ, లోక్‌సత్తా పార్టీలు తెలంగాణకు విడిగా శాఖలను ఏర్పాటు చేశారుు. ఆవిర్భావ వేడుకలకు పిలుపునిచ్చారుు. టీడీపీ వూత్రమే మొన్నటి ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన ఎన్నికల కమిటీ తప్ప ప్రత్యేకంగా తెలంగాణ శాఖను ఏర్పాటు చేయులేదు. రాజకీయు పార్టీలకు అనుబంధంగా ఉన్న సంఘాలు, విభాగాలు, ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు కూడా వేరుపడ్డారుు. తెలంగాణ ప్రజలు సైతం కొత్త రాష్ట్రాన్ని స్వాగతిస్తూ అర్ధరాత్రి నుంచే భారీ ఎత్తున సంబురాలు జరుపుకుంటూ రాష్ట్ర ఏర్పాటుకు అసలైన ఆమోదవుుద్ర వేశారు!
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top