వంద అంతస్థుల్లో తెలంగాణ సచివాలయం! | telangana secretariat to shifted to erragadda | Sakshi
Sakshi News home page

వంద అంతస్థుల్లో తెలంగాణ సచివాలయం!

Jan 27 2015 8:15 PM | Updated on Sep 2 2017 8:21 PM

ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రి

ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రి

సచివాలయం భవనాన్ని వంద అంతస్థుల్లో నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

హైదరాబాద్: సచివాలయాన్ని ఎర్రగడ్డకు మర్చాలని  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఛాతీ ఆస్పత్రి ఉన్న ప్రాంగణంలో సచివాలయం ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ సర్కారు యోచిస్తోంది. నిజాం హయాంలో నిర్మించిన చెస్ట్ ఆస్పత్రి 62 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో విస్తరించివుంది. 75 ఏళ్లుగా రోగులకు సేవలు అందిస్తోంది.

ఛాతీ ఆస్పత్రిని వికారాబాద్ కు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఇక సచివాలయం భవనాన్ని వంద అంతస్థుల్లో నిర్మించాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు  చెస్ట్ ఆస్పత్రి తరలించాలన్న ప్రతిపాదనపై వైద్యులు, సిబ్బంది నిరసిస్తున్నారు. ఆస్పత్రిని ఎర్రగడ్డ నుంచి తరలించొద్దని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement