
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాయలయంలో మంత్రి శ్రీధర్‌బాబుతో భేటీ అయ్యేందుకు వెళ్లారు. అయితే శ్రీధర్ బాబును కలిసేందుకు వెళ్లిన మధుయాష్కీ స్పృహతప్పి కిందపడిపోయారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది అత్యవసర చికిత్స నిమిత్తం ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మధుయాష్కీకి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. ఆయన ఆరోగ్యంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.