తెలంగాణ పోలీసుకు దేశవ్యాప్త గుర్తింపు: డీజీపీ | Telangana police all rounders in country, says DGP anurag sharma | Sakshi
Sakshi News home page

తెలంగాణ పోలీసుకు దేశవ్యాప్త గుర్తింపు

Jun 14 2017 8:15 PM | Updated on Sep 5 2017 1:37 PM

దేశం మొత్తంలో తెలంగాణ పోలీసుకు ఆల్‌రౌండర్‌గా గుర్తింపు వచ్చిందని డీజీపీ అన్నారు.

హైదరాబాద్: పోలీస్‌ క్రీడాకారులు సాధించిన పతకాలతో దేశం మొత్తంలో తెలంగాణ పోలీసుకు ఆల్‌రౌండర్‌గా గుర్తింపు వచ్చిందని డీజీపీ అనురాగ్‌ శర్మ అన్నారు. ఆలిండియా స్పోర్ట్స్‌ డ్యూటీ మీట్‌లో బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించిన 105 మంది పోలీస్‌ క్రీడాకారులకు రూ.70 లక్షల నగదు పురస్కారాలను పోలీస్‌ ముఖ్య కార్యాలయంలో బుధవారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీస్‌ క్రీడాకారుల ప్రాక్టీస్‌ కోసం ప్రత్యేకంగా జపాన్, కెనడా, ఇటలీ తదితర దేశాల నుంచి రూ.2.5 కోట్లు వెచ్చించి ఫైరింగ్‌ ఆర్మ్స్‌ను కొనుగోలు చేశామని, దీనికి తగ్గట్టుగా ఫలితాలు రావాలని ఆశిస్తున్నానని అన్నారు.

మంచి ఫలితాలు రాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తింపు వచ్చేలా కృషి చేయాలని సూచించారు. పోలీస్‌ క్రీడాకారులను ముందు నుంచి తోడ్పాటు అందిస్తున్న హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రాజీవ్‌ త్రివేదీతోపాటు స్పోర్ట్స్‌ ఐజీ శ్రీనివాస్‌రావులను డీజీపీ అభినందించారు. దేశంలోనే ది బెస్ట్‌ డాగ్‌ అనిపించిన రీటా సైతం రూ.3 లక్షల నగదు పురస్కారాన్ని అందుకోవడం విశేషం. కార్యక్రమంలో పోలీస్‌ అధికారులు గోపీకృష్ణ, రవిగుప్తా, శివధర్‌రెడ్డి, మల్లారెడ్డి, నాగిరెడ్డి, సంజయ్‌కుమార్‌ జైన్‌, సౌమ్యా మిశ్రా, షికా గోయల్‌, చారు సిన్హా, రమేశ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement