ఏప్రిల్‌ 14 వరకు న్యాయవ్యవస్థ లాక్‌డౌన్‌ | Telangana Judiciary system lock down unto April 14th | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌ 14 వరకు న్యాయవ్యవస్థ లాక్‌డౌన్‌

Mar 27 2020 6:22 PM | Updated on Mar 27 2020 6:24 PM

Telangana Judiciary system lock down unto April 14th - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో న్యాయవ్యవస్థ లాక్‌డౌన్‌ను ఏప్రిల్‌ 14 వరకు పొడిగిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో హైకోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కోర్టులన్నీ ఏప్రిల్‌ 14 లేదా తదుపరి ఉత్తర్వులిచ్చే వరకూ లాక్‌డౌన్‌లో ఉంటాయని పేర్కొంది. న్యాయశాఖ ఉద్యోగులు ఇళ్లల్లోనే అందుబాటులో ఉండాలని సూచించింది.

అత్యవసర అంశాల కోసం న్యాయమూర్తులు, మేజిస్ట్రేట్‌లు రోటేషన్‌పై విధుల్లో ఉండాలని హైకోర్టు ఆదేశించింది. రిమాండ్‌, బెయిల్‌ వంటి వీడియో కాన్ఫరెన్స్‌ లేదా స్కైప్‌ ద్వారా చేపట్టాలని తెలిపింది. అత్యవసర పిటిషన్లను ఈమెయిల్‌ ద్వారా దాఖలు చేయాలని స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement