5,300 మంది లెక్చరర్లకు ‘డిజిటల్‌ దిశ‘

Telangana Government To Start Digital Disha Program Today - Sakshi

నేటి నుంచి ఆన్‌లైన్‌ బోధనపై ఇంటర్‌ బోర్డు శిక్షణ  

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ బోర్డు ‘డిజిటల్‌ దిశ’గా అడుగులు వేస్తోంది. ఆన్‌లైన్‌ బోధనపై దృష్టి సారించింది. ఈ మేరకు లెక్చరర్లకు శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఈ శిక్షణాకార్యక్రమాన్ని ‘డిజిటల్‌ దిశ’పేరుతో నిర్వహించనుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు, ఎయిడెడ్‌ కాలేజీల లెక్చరర్లను ఆన్‌లైన్‌ బోధనకు సిద్ధం చేసేందుకు బోర్డు చర్యలు చేపట్టింది. ఈ శిక్షణను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం ప్రారంభిస్తారని ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ వెల్లడించారు. రాష్ట్రంలోని 5,300 మంది లెక్చరర్లను 12 బ్యాచ్‌లుగా చేసి 6 గంటల చొప్పున రెండు రోజులపాటు ఈ శిక్షణ ఇస్తామని తెలిపారు.   
(చిన్నారులే ‘ట్రాఫిక్‌ పోలీసులు’)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top