తెలంగాణ ఇంటర్ బోర్డుకు ఉత్తర్వులు జారీ | Telangana government issues GO 21 for separate inter board | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఇంటర్ బోర్డుకు ఉత్తర్వులు జారీ

Oct 20 2014 12:49 PM | Updated on Sep 2 2017 3:10 PM

తెలంగాణ ఇంటర్ బోర్డు ఏర్పాటు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ బోర్డు ఏర్పాటు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.  తెలంగాణకు ప్రత్యేక ఇంటర్ బోర్డు ఏర్పాటుకు  న్యాయశాఖ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.  ఇంటర్ బోర్డు ఏర్పాటుపై ఈ మేరకు ప్రభుత్వం జీవో నెంబర్.21ని విడుదల చేసింది.

 

మరోవైపు ఇంటర్మీడియట్ పరీక్షలను ఉమ్మడిగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతుండగా... ఆ పరీక్షలను ఇరు రాష్ట్రాలకు వేర్వేరుగానే నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.  తాజా జీవో జారీతో వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలను విద్యార్థులు తెలంగాణ ప్రభుత్వ పరిధిలోనే పరీక్షలు రాయనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement