వైరల్‌ : భలే గమ్మత్తుగా పోలీస్‌ ట్రైనింగ్‌

Telangana ASI Trains Recruits Tunes Of Mohammed Rafi Songs - Sakshi

పోలీస్‌ ట్రైనింగ్‌లో శిక్షణ ఎంత కఠినంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రోజులో 18 గంటల పాటు వివిధ రకాల ట్రైనింగ్‌ సెషన్స్‌లో పాల్గొనడంతో ఒళ్లు నొప్పులు పుట్టడం ఖాయం. ఎంతైనా అలాంటి కఠిన శిక్షణ ఉంటేనే కదా.. వారు శారీరకంగానూ, మానసికంగానూ ధృడంగా తయారయ్యేది. తాజాగా తెలంగాణ స్టేట్‌ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌లో ట్రైనీ పోలీసులకు శిక్షణ ఇస్తున్న అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.(వైరల్‌: వీళ్లు మనసు దోచుకున్న దొంగలు!)

వివరాలు.. మహ్మద్‌ రఫీ.. తెలంగాణ పోలీసుశాఖలో అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌లో విధులు నిర్వహిస్తున్న రఫీ ట్రైనీ పోలీసులకు శిక్షణ అందిస్తున్నాడు. పోలీసైన రఫీకి బాలీవుడ్‌ లెజెండరీ సింగర్‌ మహ్మద్‌ రఫీ పాటలంటే ప్రాణం.. ట్రైనీ పోలీసులకు శిక్షణ కఠినంగా అనిపించకుండా ఉండేదుకు రఫీ పాటలు పాడుతూ  శిక్షణ నిర్వహిస్తుంటాడు . తాజాగా 1970లో వచ్చిన హమ్‌జోలీ సినిమా నుంచి రఫీ పాడిన 'దల్‌ గయా దిన్‌.. హో గయి శామ్‌' పాటను పాడుతూనే శిక్షణ నిర్వహించాడు.

ఈ వీడియోనూ ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌ అసోసియేషన్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేస్తూ..'  ఇవి శిక్షణకు సంబంధించి మా రఫీ చేస్తున్న పాటలు.. ఒకరేమో పోలీస్‌.. మరొకరేమో లెజండరీ సింగర్‌..ఇద్దరు పేర్లు కామన్‌గా ఉన్నా.. మా రఫీ కూడా పాటలు బాగా పాడుతాడు. ట్రైనీ పోలీసులకు శిక్షణ అందిస్తూనే వారికి ఇంటి బెంగను, శారీరక శ్రమను మరిచిపోయేలా చేస్తాడు.. నిజంగా ఇది అతనికున్న గొప్ప అభిరుచి' అంటూ క్యాప్షన్‌ జత చేశారు.  ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top