
రియాద్‌లో ప్లకార్డులతో కార్మికుల నిరసన
సాక్షి, మల్యాల(చొప్పదండి): గల్ఫ్ బాట పట్టిన తెలంగాణ కార్మికుల కోసం ఎన్‌ఆర్‌ఐ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సౌదీ అరేబియాలోని రియాద్ ప్రాంతంలో గల్ఫ్ కార్మికులు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. గల్ఫ్ కార్మికుల అవగాహన వే దిక ఉపా«ధ్యక్షుడు బడుగు లక్ష్మణ్, సలహా దారుడు సత్రబోయిన దేవన్న, ఇన్‌చార్జి ఉప్పల్వాయి శంకర్, కోఆర్డినేటర్స్ గుండబోయిన కృష్ణ, కంకార్ల సురేశ్ ఆధ్వర్యంలో ప్లకార్డులు నిరసన కార్యక్రమం చేపట్టారు.