పెన్షన్‌ భిక్ష కాదు.. ఉద్యోగి హక్కు

teachers pension is not a Alms of the government it is an employees right - Sakshi

సుభాష్‌నగర్‌(నిజామాబాద్‌ అర్బన్‌) : ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెన్షన్‌ ప్రభుత్వం పెట్టే భిక్ష కాదని, అది ఉద్యోగి హక్కు అని ఏబీఆర్‌ఎస్‌ఎం జాతీయ ఉపాధ్యక్షులు పాలేటి వెంకట్‌రావు పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని ఏబీవీపీ కార్యాలయంలో తపస్‌ ఇందూర్‌ జిల్లా కార్యనిర్వాహక వర్గ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వెంకట్‌రావు మాట్లాడుతూ...  వృత్తి పట్ల నిబద్ధత కలిగిన కార్యకర్తల సమూహమే తపస్‌ సంఘం అని తెలిపారు. సీపీఎస్‌ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి, పాత పింఛన్‌ విధానాన్ని అమలుయాలని డిమాండ్‌ చేశారు. 

జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఇప్పకాయల సుదర్శన్, పాపగారి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ సీపీఎస్‌ రద్దు కోరుతూ తపస్‌ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ వద్ద 27వ తేదీన ధర్నా చేపడుతున్నట్లు పేర్కొన్నారు.  అనంతరం ధర్నాకు సంబంధించిన పోస్టర్లను వారు విడుదల చేశారు.  రాష్ట్ర కార్యదర్శి కీర్తి సుదర్శన్, జిల్లా కోశాధికారి రమేష్‌లాల్, నాయకులు కృష్ణవేణి, శ్రీకాంత్, లక్ష్మీనర్సయ్య, అరుణ్, నరోత్తం, వివిధ మండలాల బాధ్యులు నాగభూషణం, రాము, గోపి, సాయిలు పాల్గొన్నారు.

‘సీపీఎస్‌’ ను రద్దు చేయాలి:వెంకట్‌రావు 
కామారెడ్డి టౌన్‌: హర్యాన రాష్ట్రంలో మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని అఖిల భారత రాష్ట్రిక శైక్షిక్‌మహాసంఘ్‌(ఏబీఆర్‌ఎస్‌ఎం) న్యూఢిల్లీ జాతీయ ఉపాధ్యక్షుడు పాలెటి వెంకట్‌రావు అన్నారు. ఆదివారం సరస్వతి శిశుమందిర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తపస్‌ ఆధ్వర్యంలో సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని జిల్లా కేంద్రంలో ఈనెల 27న నిర్వహిస్తున్న ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణలో సీపీఎస్‌పై శాసనసభలో ఎటువంటి తీర్మాణాన్ని చేయకపోవడంతో సమస్య శాపంలా మారిందన్నారు. ఈ సమావేశంలో తపస్‌ జిల్లా అధ్యక్షుడు రమేష్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి రవీంద్రనాథ్, నాయకులు రమేష్, లక్ష్మిపతి, రాజశేకర్, ఆంజనేయులు, తదితరులున్నారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top