విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు  | Teacher over action on student | Sakshi
Sakshi News home page

విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు 

Nov 5 2017 2:52 AM | Updated on Nov 5 2017 2:52 AM

Teacher over action on student - Sakshi

చికిత్స పొందుతున్న చంద్రశేఖర్‌

టేకులపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం గంగారం ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి విద్యార్థి గోళ్ల చంద్రశేఖర్‌ని గణిత ఉపాధ్యాయుడు ఎ.లక్ష్మణ్‌ చితకబాదిన ఘటన నాలుగు రోజుల తర్వాత ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రస్తుతం ఆ విద్యార్థి తీవ్ర నొప్పితో మెడను నిలపలేక, ఓ పక్కకు వంచేస్తూ అవస్థ పడుతున్నాడు. క్లాసు చెబుతుండగా.. తోటి విద్యార్థి వద్ద నోట్‌బుక్‌ తీసుకుంటున్నాడని ఆగ్రహించిన ఉపాధ్యాయుడు చంద్రశేఖర్‌ మెడను వంచి బల్లకు బాదినట్లు విద్యార్థులు చెబుతున్నారు. బూతులు తిడుతూ, తీవ్రంగా కొట్టారని, బాధిత విద్యార్థి మెడ నిటారుగా నిలపలేకపోతున్నాడని చెబుతున్నారు. తల్లిదండ్రులు విద్యార్థిని ఈనెల 3న ఖమ్మంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. స్కానింగ్‌ చేయగా, వెన్నుపూస ఎముకకు తీవ్ర గాయమైందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన పట్ల గంగారం ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎంను ఎన్‌.చందును వివరణ కోరగా.. ఈ ఘటన బాధాకరమేనని, ఆ విద్యార్థికి చికిత్స చేయిస్తామని తెలిపారు. ఉపాధ్యాయుడిపై చర్యల కోసం డీటీడీవోకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement