టీడీపీ, టీఆర్‌ఎస్‌ నుంచి...కాంగ్రెస్‌లోకి... | Tdp, Trs leaders Join Congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ను ఆదరిస్తున్న ప్రజలు

Apr 2 2018 8:52 AM | Updated on Mar 18 2019 9:02 PM

Tdp, Trs leaders Join Congress - Sakshi

కాంగ్రెస్‌లో చేరిన టీడీపీ, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు

మిర్యాలగూడ టౌన్‌ : ఎంతో చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీని ఆదర్శిస్తునే పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని సీఎల్‌పీ నేత, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని రాజీవ్‌ భవన్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో త్రిపురారం మండల పార్టీ అధ్యక్షులు మర్ల చంద్రారెడ్డి ఆధ్వర్యంలో అప్పలమ్మగూడెం గ్రామ పంచాయతీలోని లోక్యతండాకు చెందిన టీడీపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలకు చెందిన 50 కుటుంబాల కార్యకర్తలు సీఎల్‌పీ నేత కుందూరు జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలను కప్పి స్వాగతించారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధే కానీ టీఆర్‌ఎస్‌ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు.   పార్టీలో చేరిన వారిలో జి. రాజు, జి. వెంకటేశ్వర్లుతో పాటు మరో 50 కుటుంబాల కార్యకర్తలున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మర్ల చంద్రారెడ్డి, స్కైలాబ్‌నాయక్, బసవయ్య, శంకర్‌నాయక్, ఖరీం ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement