ఓటుకు కోట్లు వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వంతపాడుతున్న తెలంగాణ టీడీపీ
బండా నరేందర్‌రెడ్డి
కోదాడ అర్బన్ : ఓటుకు కోట్లు వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వంతపాడుతున్న తెలంగాణ టీడీపీ నాయకులు ఇకనైనా తమ తప్పు తెలుసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంలు హితవు పలికారు. శనివారం కోదాడలోని టీఆర్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శిస్తున్న కాంగ్రెస్ పెద్దలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు చంద్రబాబునాయుడుకు మద్దతు తెలిపే విధంగా మాట్లాడడం సరైంది కాదన్నారు.
టీన్యూస్ చానల్‌కు నోటీసులు జారీచేయడం మీడియా స్వేచ్ఛను హరించడమేనన్నారు. సమావేశంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, రాష్ట్ర నాయకుడు తేరా చిన్నపురెడ్డి, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ పార సీతయ్య, చిలుకూరు ఎంపీపీ బి.నాగేంద్రబాబు, నాయకులు డేగ బాబు, మట్టపల్లి శ్రీనివాస్‌గౌడ్, బూత్కూరి వెంకటరెడ్డి, కె.బాబు, కోటేశ్వరరావు ఉన్నారు.
ఉప ఎన్నికల్లో పోటీపై త్వరలోనే నిర్ణయం
జూలై 4న జరిగే నడిగూడెం జెడ్పీటీసీ, మునగాల మండలం నర్సింహులగూడెం సర్పంచ్ ఉప ఎన్నికల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులను స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో నిలిపితే వారికి మద్దతిస్తామని నరేందర్‌రెడ్డి ప్రకటించారు. పార్టీల పరంగా అభ్యర్థులు పోటీలో ఉంటే తమ పార్టీ అభ్యర్థులను బరిలో నిలుపే విషయంపై త్వరలోనే నిర్ణయం వెల్లడిస్తామన్నారు.