కారు ఎక్కనున్న టీడీపీ మాజీ మంత్రి | TDP leader tummala nageswara rao to join TRS! | Sakshi
Sakshi News home page

కారు ఎక్కనున్న టీడీపీ మాజీ మంత్రి

Aug 20 2014 2:11 PM | Updated on Aug 15 2018 9:22 PM

కారు ఎక్కనున్న టీడీపీ మాజీ మంత్రి - Sakshi

కారు ఎక్కనున్న టీడీపీ మాజీ మంత్రి

ఖమ్మం జిల్లాలో తెలుగు దేశం పార్టీకి ఎదురు దెబ్బ తగలనుంది. రెండుగా చీలిన ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ నుంచి ఓ వర్గం పార్టీకి దూరమవనుంది

ఖమ్మం : ఖమ్మం జిల్లాలో తెలుగు దేశం పార్టీకి ఎదురు దెబ్బ తగలనుంది. రెండుగా చీలిన ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ నుంచి ఓ వర్గం పార్టీకి దూరమవనుంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తనను పనికట్టుకొని ఓడించారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసంతృప్తితో ఉన్నారు.

 

అధినేత చంద్రబాబు నాయుడు దగ్గర కూడా తనకన్నా తన ప్రత్యర్థివర్గం మాటే ఎక్కువగా చెల్లుబాటు అవుతుండడంతో... కలత చెందిన తుమ్మల తన వర్గీయులతో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు తుమ్మల సీఎం కేసీఆర్‌తో కలిసి సమావేశమైనట్టు సమాచారం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement